తండ్రిని కాలుతో తొక్కి చంపిన కొడుకు
తండ్రిని గొంతుపై కాలుతో తొక్కి చంపాడు తనయుడు. ఈ ఘటన అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం యలగలవంకతాండలో జరిగింది. విచ్చలవిడిగా కొడుకు అప్పులు చేస్తున్నాడని తండ్రి మందలించాడు. దీంతో కొపొద్రికుడైన కొడుకు రాజశేఖర్ తండ్రి తిప్పేస్వామి నాయక్(53) గొంతుపై కాలుతో తొక్కాడు. ఘటనాస్థలికి చేరుకుని గ్రామస్తులను విచారిస్తున్నారు పోలీసులు.