Feb 16, 2025, 04:02 IST/
ఢిల్లీ తొక్కిసలాట ఘటనపై కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
Feb 16, 2025, 04:02 IST
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో నలుగురు పిల్లలు సహా 18 మంది చనిపోవడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.