డివైడర్ ను ఢీకొన్న లారీ.. తృటిలో తప్పిన ప్రమాదం
బుక్కరాయసముద్రం మండలం ఎన్టీఆర్ మార్గ్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున వరి ధాన్యంతో వెళ్తున్న లారీ అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొనడంతో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ డివైడర్ ని ఢీ కొని కింద పడడంతో ట్రాఫిక్ కి అంతరాయం వాటిల్లింది. లారీ ఢీ కొన్న సమీపంలో స్థానికులు ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.