AP: బెజవాడ సిద్దార్థ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ కలకలం రేపింది. గత బుధవారం జనరల్ మెడిసిన్ పరీక్ష రాస్తూ ముగ్గురు విద్యార్థులు పట్టుబడగా.. శనివారం కమ్యూనిటీ మెడిసిన్ (పార్ట్ 1) పరీక్ష రాస్తూ ఇద్దరు విద్యార్థులు పట్టుబట్టారు. మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడిన విద్యార్థులను ఎన్నారై, నిమ్రా కళాశాల విద్యార్థులుగా గుర్తించారు. వరుసగా మాల్ ప్రాక్టీస్ ఘటనలు నమోదవ్వడంతో ప్రభుత్వం సీరియస్ అయింది.