సుడాన్‌లో మరోసారి మారణహోమం జరిగింది. ఎల్ ఫాషర్‌లోని వలస శిబిరాలపై పారామిలటరీ ఆర్ఎస్ఎఫ్ విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 114 మంది పౌరులు మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. కాల్పుల నుంచి తప్పించుకోవడానికి ప్రజలు భయాందోళనతో పరుగులు పెడుతున్న వీడియో నెట్టింట వైరలవుతోంది. కాగా, ఆ దేశంపై పట్టుకోసం సైన్యం, ఆర్ఎస్ఎఫ్‌ల మధ్య రెండేళ్లుగా పోరు జరుగుతుండగా.. ఇప్పటివరకు 29 వేల మంది మరణించినట్లు సమాచారం.