
ధర్మవరంలో వినియోగదారుల దినోత్సవం
ధర్మవరం పట్టణంలోని కేహెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం వినియోగదారుల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వినియోగదారుల హక్కులు బాధ్యతలు గురించి విద్యార్థులకు ఆయన తెలియజేశారు. అనంతరం వినియోగదారుల హక్కులు బాధ్యతలు గురించి విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు.