May 02, 2024, 15:05 IST/కామారెడ్డి
కామారెడ్డి
హెచ్ఐవి, టిబి వ్యాధులపై అవగాహన
May 02, 2024, 15:05 IST
అవగాహన, జాగ్రత్తలతోనే హెచ్ఐవి నివారణ సాధ్యమవుతుందని వైఆర్జికేర్ పౌండేషన్ లింక్ వర్కర్ స్కీమ్ లింక్ వర్కర్ బాలకిషన్ తెలిపారు. గురువారం మాచారెడ్డిలోని పీహెచ్సీలో ఆశాడే సమావేశంలో ఆయన పాల్గొన్నారు. లింక్ వర్కర్ బాలకిషన్ మాట్లాడుతూ లింక్ వర్కర్ స్కీం అందిస్తున్న సర్వీస్ల గురించి తెలిపారు. హెచ్ఐవి, టిబి, సుఖ వ్యాధులపై అవగాహన కల్పించారు. అవగాహనతోనే ఆయా వ్యాధుల నివారణ జరుగుతుందన్నారు.