తెలంగాణలో ఘోరం జరిగింది. మహబూబాబాద్ (D) డోర్నకల్ (M) జోగ్య తండాకు చెందిన వెంకటేష్, ఉష దంపతులకు ఇద్దరు పిల్లలు. ఇటీవల అనారోగ్యంతో వెంకటేష్ చనిపోయాడు. తర్వాత ఓ పోలీస్ అధికారితో ఉష ఎఫైర్ పెట్టుకుంది. పిల్లలు నిత్యశ్రీ (5), వరుణ్ తేజ (7) అడ్డుగా ఉన్నారని వారికి ఫిబ్రవరి 5న కూల్‌డ్రింక్‌లో గడ్డి మందు కలిపి ఇచ్చింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిత్యశ్రీ చనిపోగా.. వరుణ్ కోలుకుంటున్నాడు.