భారీ వర్షంతో ధర్మవరంలో రోడ్లన్నీ జలమయం

69చూసినవారు
ధర్మవరంలో శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి పట్టణంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పీఆర్డీ సర్కిల్లోని సుదర్శన కాంప్లెక్స్ వెనుక వైపు ఉన్న రహదారిలో ద్విచక్ర వాహనం వర్షం నీటిలో మునిగింది. మోకాలి లోతు నీరు రావడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాలైన గుడ్డి బావి వీధి, శివానగర్, కేశవానగర్, మాధవ నగర్ నీట మునిగాయి.

సంబంధిత పోస్ట్