బీజేపీ ధర్మవరం రూరల్ మండలం అధ్యక్షుడిగా గొట్లూరు చంద్రను ఎన్నుకున్నట్లు జిల్లా అధ్యక్షుడు జీఎం శేఖర్ మంగళవారం తెలిపారు. మంత్రి సత్యకుమార్ ఆదేశాల మేరకు గొట్లూరు చంద్రను రూరల్ మండలం అధ్యక్షుడిగా ఎన్నుకున్నామన్నారు. చంద్ర మాట్లాడుతూ మంత్రి సత్యకుమార్, జీఎం శేఖర్, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.