భారత కమ్యూనిస్టు పార్టీ 100 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ధర్మవరం పట్టణంలో సిపిఐ నాయకులు కార్యకర్తలు భారీగా ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని మారుతి రాఘవేంద్ర స్వామి కళ్యాణమండపం నుండి ఎన్టీఆర్ సర్కిల్ కళాజ్యోతి సర్కిల్ మీదుగా ఆర్టీసీ బస్టాండ్ వరకు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో ధర్మవరం నియోజకవర్గ వ్యాప్తంగా నాలుగు మండలాల నుండి సిపిఐ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు.