ధర్మవరం పట్టణంలోని మున్సిపల్ పాఠశాలలో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్లకు వేతనాలు పెంచాలని మున్సిపల్ చైర్ పర్సన్ కాచర్ల లక్ష్మిని సిఐటియు నాయకులు ఆయుబ్ కలిసి విజ్ఞప్తి చేశారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయం వద్ద శానిటేషన్ సిబ్బందితో కలిసి చైర్ పర్సన్ కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం సిఐటియు డివిజన్ కార్యదర్శి జెవి రమణ పాల్గొన్నారు.