ధర్మవరంలో ఆర్డీవో ఆఫీస్ లో ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పై అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ. ఈ పథకం వల్ల గృహ వినియోగదారులకు అతి తక్కువ విద్యుత్ బిల్లు వస్తుందన్నారు. ఇంటిపై కప్పుపై కనీసం 10 చదరపు మీటర్లు/100 చదరపు అడుగుల స్థలంలో 1kwp సామర్థ్యం కలిగిన సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకోవచ్చన్నారు.