ధర్మవరం మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కాంట్రాక్ట్ కార్మికులకు తక్షణమే పెండింగ్ ఉన్న జీతాలను చెల్లించాలని బుధవారం పారిశుద్ధ కార్మిక సంఘం నాయకులు సీఐటీయూ నాయకులు మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. కమిషనర్తో మాట్లాడుతూ. తక్షణమే జీతాలు విడుదల చేసి పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు కూడా కల్పించాలని వినతి పత్రం అందించారు.