ధర్మవరం పట్టణం నుంచి సంగాల గ్రామానికి వెళ్లే రహదారిలో పలు చోట్ల గుంతలు పడి అధ్వానంగా ఉంది. రహదారిలో గుంతలు పడి కంకర తేలి ప్రయాణానికి ఇబ్బందిగా ఉండటంతో పాటు వాహనాలు మరమ్మత్తులకు గురవుతున్నాయని వాహనదారులు ఆదివారం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి రహదారి మరమ్మతులకు తగిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.