ధర్మవరం లోని చెరువు కట్ట మొదటి మరువ వద్దకు రేపు శుక్రవారం మంత్రి సత్యకుమార్ యాదవ్ జల హారతి కార్యక్రమానికి వస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్, మంత్రి కార్యాలయ ఇన్ఛార్జ్ హరీష్ బాబు ఆధ్వర్యంలో చెరువు కట్ట సమీపంలో చెత్తాచెదారం లేకుండా శానిటేషన్ కార్యక్రమాలు చేయించారు. దుర్గంధం రాకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లించారు.