చేనేతలకు హెల్త్ కార్డులు జీవిత బీమా పాలసీ ఉచితంగా ఇవ్వాలి

1076చూసినవారు
చేనేతలకు హెల్త్ కార్డులు జీవిత బీమా పాలసీ ఉచితంగా ఇవ్వాలి
ధర్మవరం పట్టణంలో చేనేత కార్మికులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని చేనేత సంఘం ధర్మవరం అధ్యక్షురాలు జయశ్రీ అన్నారు. మంగళవారం ధర్మవరంలో ఆమె మాట్లాడుతూ చేనేతలు మగ్గం లోకి దిగిన తర్వాత మోకాళ్ళ నొప్పులు కిడ్నీకి సంబంధించిన వ్యాధులు కంటి చూపు మొదలైన అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, కావున ప్రభుత్వం చేనేత కార్మికులకు హెల్త్ కార్డులు మంజూరు చేసి అధిక మొత్తంలో ఇన్సూరెన్స్ పాలసీని ఉచితంగా ఇవ్వాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్