ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండలం మాల్యవంతం గ్రామంలో శనివారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పర్యటించారు. ఈ సందర్భంగా "పల్లె పండుగ" కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఆయన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.