విద్యార్థులకు 22 సైకిళ్ల అందజేత
గోరంట్ల మండలం మల్లాపల్లి గ్రామంలో దాతలు ఏర్పాటు చేసిన 22 సైకిళ్లను 142 యూనిఫాంలను విద్యార్థులకు మంగళవారం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ చేతులు మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్బంగా దాతలను మంత్రి అభినందించారు. కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.