రైలు డోర్ వద్ద వేలాడుతూ ప్రమాదకర స్టంట్స్ చేసిన యువకుడు (వీడియో)

54చూసినవారు
సోషల్ మీడియా మోజులో పడి ప్రాణాలతో చెలగాటమాడుతున్నామన్న విషయాన్ని కూడా గుర్తించలేని యువత కోకొల్లలు. అలాంటి ఓ యువకుడి వీడియో ట్రెండింగ్‌లో ఉంది. ఇందులో యువకుడు చేసిన దుస్సాహసం చూసి జనాలు షాకైపోతున్నారు. వేగంగా వెళుతున్న రైలు డోర్ వద్ద కడ్డీలను పట్టుకుని ఓ యువకుడు బయటకు వంగుతూ స్టంట్స్ చేశాడు. కాళ్లు బయటకు చాపుతూ కరెంట్ పోల్స్ రాగానే లోపలికి లాగేసుకుంటున్నాడు. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్