పామిడి మండలం నీలూరు గ్రామంలో ఓ పొలం తగాదా విషయంలో ఇద్దరిపై మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు. నీలూరు గ్రామానికి చెందిన అరుణ, సరళమ్మ, చిదంబరమ్మ అనే మహిళలు వారి ఎకరా పొలంలో జొన్న పంట సాగు చేశారు. భూతగాదా నేపథ్యంలో ఇదే గ్రామానికి చెందిన ఇద్దరు మంగళవారం ట్రాక్టర్ తీసుకెళ్లి జొన్న పంటను తొలగించారు. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదుతో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు సీఐ యుగంధర్ తెలిపారు.