తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని బ్రాందీ షాపుల సేల్స్ మెన్ లు, సూపర్వైజర్లు శుక్రవారం గుత్తి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. సేల్స్ మెన్ లు, సూపర్వైజర్లు వెంకీ, మల్లికార్జున, అశోక్, విజయ్ ల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంతో చర్చల విఫలమైతే ఆందోళన బాటపడతామని హెచ్చరించారు. ఎక్సైజ్ ఎస్సై కు వినతిపత్రం అందజేశారు.