గుత్తి మండలం బాచుపల్లిలో కుటుంబ కలహాల కారణంగా ఆదివారం రాత్రి కోడలు నందినిపై అత్త లక్ష్మీదేవి రాయితో దాడిచేసి గాయపరిచారు. ఈ దాడిలో నందిని తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను చికిత్స నిమిత్తం గుత్తి ఆసుపత్రికి తరలించగా వైద్యుల సూచనల మేరకు అనంతపురానికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.