గుత్తి డివిజన్ పరిధిలోని గుంతకల్లు, పెద్దవడుగూరు, పామిడి, గుత్తి మండలాల్లో రబీ సీజన్ లో టమాటా పంట సాగు చేసిన రైతులు బీమా ప్రీమియం చెల్లించాలని డివిజన్ ఉద్యానవన అధికారిణి మిత్రవింద మాధవి తెలిపారు. సోమవారం స్థానిక కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ రబీలో టమాటా సాగు చేసిన రైతులు పంటలను ఈక్రాప్ బుకింగ్ చేయించాలన్నారు. డిసెంబర్ 15 లోపు ఎకరాకు రూ. 1. 600 చొప్పున ప్రీమియం చెల్లించాలన్నారు.