గుత్తి పట్టణంలోని చంద్రప్రియ నగర్ లో మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా ఆదివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడు, గుత్తి మండల ఇన్చార్జి గుమ్మనూరు నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముస్లిం మైనారిటీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.