గుంతకల్లు పట్టణంలో ప్రజా సమస్యలపై సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రజాపోరు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు శ్రీనివాసులు మాట్లాడుతూ నవంబర్ 8 నుంచి 14 వరకు ఈ ప్రజా పోరు జరుగుతుందన్నారు. పెరిగిన నిత్యవసర ధరలను తగ్గించాలని, మహిళలు, దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని వారి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.