గుత్తి పట్టణంలోని అతి పురాతనమైన శ్రీ గౌతమేశ్వర ఆలయంలో కార్తీకమాసం 3వ శనివారం సందర్భంగా ఆలయంలో స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. వేకువ జామున స్వామివారి మూలమూర్తికి సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకాలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ ఆవరణలో మహిళలు దీపాలను వెలిగించి తమ మొక్కులను చెల్లించుకున్నారు.