గుత్తి మండలంలోని పీ. ఎర్రగుడి, ధర్మపురం, పూలకుంట, తదితర గ్రామాలకు రహదారులు కొన్నేళ్ల నుంచి శిధిలమయ్యాయి. భారీ వర్షాల కారణంగా రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో ప్రయాణికుల రాత్రిళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతుకుల రోడ్డులో ప్రయాణించి ప్రమాదాలబారిన పడుతున్నారు. ప్రభుత్వం నూతన రోడ్లను మంజూరు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.