ఒక వ్యక్తి పై రెండు కంటే ఎక్కువ కేసులు నమోదైతే పీడీ యాక్ట్ ను నమోదు చేస్తామని ఉమ్మడి అనంత జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య అన్నారు. గుత్తి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ను సోమవారం డిప్యూటీ కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన రికార్డులను పరిశీలించారు. ఒక వ్యక్తి పై రెండు కంటే ఎక్కువ కేసులు నమోదైతే తప్పకుండా పీడీ నమోదు చేస్తామని హెచ్చరించారు.