గుంతకల్లు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆరవ రోజు మంగళవారం అమ్మవారు. శ్రీ చాముండేశ్వరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు వేకువజామున అమ్మవారికి వేదమంత్రాల నడుమ విశేష పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని వెండి, బంగారు ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అమ్మవారి నామస్మరణతో ఆలయం మారు మోగింది.