అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం వైకాపా ప్రభుత్వంతోనే సాధ్యం అవుతుందని మున్సిపల్ చైర్ పర్సన్ భవాని అన్నారు. సోమవారం గుంతకల్లు పట్టణంలోని 14వార్డులో ఆ వార్డు కౌన్సిలర్ సాయిపోగు రంగమ్మ ఆధ్వర్యంలో ఏపికి జగనన్నే ఎందుకు కావాలి కార్యక్రమం నిర్వహించారు. సచివాలయంలో సంక్షేమ పథకాలు డిస్ప్లే బోర్డును చైర్ పర్సన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆ వార్డు ఇంచార్జీ వీరేశ్ తదితరులు పాల్గొన్నారు.