గుంతకల్లు పట్టణంలో ప్రభుత్వ స్థలాలలో గుడిసెలు వేసుకున్న వారికి ఇండ్ల పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ కు మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు ఆయన సానుకూలంగా స్పందించారు. అర్హులైన పేదలందరికీ సంబంధిత అధికారులతో విచారణ జరిపి ఇళ్ల పట్టాలను మంజూరు చేస్తామని వారికి హామీ ఇచ్చారు.