గుంతకల్లులోని పాత బస్టాండ్ వద్ద ద్విచక్ర వాహనంలో ఉంచిన నగదు మంగళవారం చోరీ గురైంది. పాత బస్టాండ్ లోని హైదరాబాదు బిర్యానీ హోటల్ ఎదురుగా చంగీజ్ ఖాన్ జిమ్ నిర్వహస్తున్నాడు. మధ్యాహ్నం కెనరా బ్యాంక్లో రూ. 2. 90లక్షలు డ్రా చేసుకుని ద్విచక్ర వాహనంలో ఉన్న బ్యాగ్ లో పెట్టుకుని జిమ్ వద్దకు వచ్చాడు. అక్కడ పని చూసుకుని వెళ్లి ద్విచక్ర వాహనంలో డబ్బు చూడగా కనిపించలేదు. ఈ విషయాన్ని అతను టూటౌన్ పోలీస్ స్టేషన్ లో అతను ఫిర్యాదు చేశాడు.