లచ్చానిపల్లి గ్రామపంచాయతీలో ఎస్సీ కాలనీలో దాదాపు 20 వీధి లైట్లు వెలగడం లేదని.. గ్రామ ప్రజలు వాపోయారు. కాలనీ అంతా కారు చీకట్లో ఉందని రాత్రిపూట బయట తిరగాలంటే భయంగా ఉందని.. గ్రామ ప్రజలు తెలిపారు. దీనికి సంబంధించి సచివాలయ వ్యవస్థ గాని పంచాయతీ సెక్రటరీ గాని పట్టించుకోవడం లేదు కనీసం పై అధికారులు అయినా స్పందించి మా గ్రామంలో వీధిలైట్లు వెలిగించాలని లచ్చానిపల్లి గ్రామ ప్రజలు కోరుతున్నారు.