మైదుగోళం స్కూల్ కమిటీ ఎన్నికలు వాయిదా

69చూసినవారు
మైదుగోళం స్కూల్ కమిటీ ఎన్నికలు వాయిదా
రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు గురువారం నిర్వహించారు. లేపాక్షి మండల వ్యాప్తంగా 58ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 57 పాఠశాలలకు ఎన్నికలు నిర్వహించారు. మైదుగోళం ప్రభుత్వ పాఠశాలలో కోరం లేకపోవడంతో ఎన్నికలు వాయిదా పడినట్లు ఎంఈఓ నాగరాజునాయక్ తెలిపారు. 57 పాఠశాలల్లోనూ ఎన్నికలు సజావుగా జరిగి ఛైర్మన్, వైస్ ఛైర్మన్, సభ్యులను ఎన్నుకున్నామన్నారు.

సంబంధిత పోస్ట్