పిఠాపురం అభివృద్ధిలో మరో ముందడుగు: పవన్

67చూసినవారు
పిఠాపురం అభివృద్ధిలో మరో ముందడుగు: పవన్
AP: పిఠాపురం అభివృద్ధిలో మరో ముందడుగు పడిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. రోడ్డు ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులు వచ్చాయి. దీనిపై ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు. ‘పిఠాపురం ప్రాంతంలో రోడ్డు ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.59.70 కోట్లు మంజూరు చేసి.. పాలనపరమైన అనుమతి లభించడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ వంతెన నిర్మాణం పూర్తయిన తర్వాత రాకపోకలు సులభతరం అవుతాయి.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్