హైదరాబాద్ MMTS రైలులో జరిగిన అత్యాచారయత్నం ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. శాంతిభద్రతలపై ప్రతిపక్షం దుష్ప్రచారం చేస్తూ పెట్టుబడులు రాకుండా అడ్డుకోవాలని కుట్రచేస్తోందని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో దిశ ఘటన జరిగిందని, వామనరావు దంపతులను నడిరోడ్డుపై చంపారని అన్నారు. అత్యాచారం కేసులో.. BRS నేత కుమారుడు ఉన్నా చర్యలు తీసుకోలేదని, కానీ, MMTS ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించిందని CM పేర్కొన్నారు.