TG: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బెట్టింగ్ యాప్స్‌పై సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆన్‌లైన్ బెట్టింగ్ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని అన్నారు. అయితే ఇప్పటికే పలువురు సినీ, యూట్యూబర్లపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే.