AP: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కోటరీ వ్యాఖ్యలపై బొత్స సత్యనారాయణ స్పందించారు. ‘కోటరీ అంటే ఏంటి? వైసీపీలో ఉన్నప్పుడే ఆయన చెప్తే బాగుండేది. ఆయన ఉన్నప్పుడు చెప్పి ఉంటే అందరూ అదే మాట అనేవారు. కోటరీ ఉందని, ఆయన కూడా కోటరీలో ప్రథముడనేవారు. ఇప్పుడు ఆయన వెళ్లిపోయి.. ఇంకొకరిని అంటే ఎలా? ఇలాంటివి అంటుంటారు.. పోతుంటారు. నేను వీటికి సమాధానం చెప్పను.’ అని బొత్స అన్నారు.