పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం: ఐసీడీఎస్ పీడీ

50చూసినవారు
పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం: ఐసీడీఎస్ పీడీ
పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం అని ఐసీడీఎస్ పీడీ నాగమలేశ్వరి పేర్కొన్నారు. శనివారం తనకల్లు మండలం చీకటిమానిపల్లి అంగన్వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన పోషణ్ మాహ్ కార్యక్రమానికి పీడీ హాజరయ్యారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పుట్టబోయే బిడ్డ, తల్లి ఆరోగ్యంగా ఉండాలంటే ఎటువంటి పోషక పదార్థాలు తీసుకోవాలో వివరించారు. కార్యక్రమంలో సీడీపీఓ గంగరత్న, సూపర్ వైజర్లు కె. రఫీమున్నీసా, పద్మ, లక్ష్మీ, జయ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్