పలువురిని అలరించిన చిన్నారుల భరతనాట్యం

79చూసినవారు
కళ్యాణదుర్గం పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి పురస్కరించుకొని ఆదివారం రాత్రి చిన్నారులు భరతనాట్యం చేశారు. రాత్రి 8గంటల నుంచి 10 గంటల వరకు భరతనాట్యం కార్యక్రమాన్ని నిర్వహించారు. బాలికల భరతనాట్యం శ్రోతలను ఎంతగానో అలరించింది. భరతనాట్యం చేసి అందరిని అలరించిన చిన్నారులకు ఆలయ కమిటీ సభ్యులు బహుమతులు ప్రధానం చేశారు.

సంబంధిత పోస్ట్