కళ్యాణదుర్గం పట్టణంలో వెలసిన శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి పంచ జ్యోతుల ఉత్సవాలను జనవరి 16, 17వ తేదిలలో నిర్వహించనున్నట్లు ఆలయ అభివృద్ధి కమిటీ ఛైర్మన్ నాగరాజు మంగళవారం విలేఖరులకు తెలిపారు. ఈ సందర్భంగా జనవరి 16వ తేది పెన్న అహోబిలం నుంచి పులికాపు జలం తీసుకువచ్చి అమ్మవారికి అభిషేకాలు, అనంతరం 17వ తేది సూర్యోదయా త్పూర్వం పంచ జ్యోతుల ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.