విద్యుత్ షాక్ కు గురై విద్యుత్ కార్మికుడు లోకేష్ తీవ్రంగా గాయపడిన ఘటన కళ్యాణదుర్గం పట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు బాధితుడిని కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా పరిస్థితి విషమించడంతో అనంతపురంకు తరలించారు. బాధితుడికి ప్రభుత్వం అండగా నిలబడాలని యూనియన్ నాయకులు కోరారు.