కళ్యాణదుర్గం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహణపై గందరగోళ పరిస్థితి ఏర్పడింది. మంగళవారం ఆరుగురు టీడీపీ కౌన్సిలర్లు కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని కమీషనర్ వంశీ కృష్ణ భార్గవ్ కు విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ ఛైర్మన్ స్పందించకపోవడంతో కౌన్సిల్ సమావేశం నిర్వహించలేని పరిస్థితి ఉందని వివరణ ఇచ్చారు. టీడీపీ కౌన్సిలర్లు మీటింగ్ పెట్టాలని మీడియాలో ఛైర్మన్ కు విజ్ఞప్తి చేశారు.