కళ్యాణదుర్గం పట్టణ కేంద్రంలోని ఆర్అండ్ బి అతిథి గృహంలో మంగళవారం ఎమ్మార్పీఎస్ నాయకుల సమావేశం జరిగింది. సమావేశానికి ఉమ్మడి అనంతపురం జిల్లాల ఎమ్మార్పీఎస్, ఏంఎస్పీ అధ్యక్షుడు డాక్టర్ సామ్రాట్ కెబి మధు మాదిగ ముఖ్య అతిథులుగా హాజరై ఏకసభ్య కమిషన్ కు వివిధ కుల, ప్రజా స్వచ్చందంగా సంస్థల ద్వారా ఎస్సీ వర్గీకరణ అమలుకై ఉత్తరాలు పంపాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.