కళ్యాణదుర్గం పట్టణం బెంగళూరు రోడ్డులోని గోల్డెన్ బెల్స్ పాఠశాల సమీపంలో గుంతలు పడి ప్రమాదాలకు పిలుపుగా నారాయణ పట్టణ ప్రజలు మంగళవారం విలేఖరులకు తెలిపారు. ఇటీవల ప్రభుత్వం గుంతల రోడ్డు మరమ్మతులకు రూ. 1. 60 కోట్లను మంజూరు చేసినా గుంతల రోడ్లకు పరిష్కారం కాలేదన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.