కళ్యాణదుర్గంలోని కనకదాసు కల్యాణ మంటపంలో నియోజకవర్గ కురుబ సంఘం అధ్యక్షుడు కామక్కపల్లి నాగరాజు ఆధ్వర్యంలో కురుబ కుల సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా బోరంపల్లి ఆంజనేయులు పాల్గొన్నారు. 5 మండలాల అధ్యక్షులు, కల్యాణదుర్గం పట్టణ, రూరల్ అధ్యక్షులు, ప్రచార కార్యదర్శులు, కుల సంఘ మాజీ అధ్యక్షులు, కుల పెద్దలు కూడా ఈ సమావేశంలో ఉన్నారు. నవంబర్ 18న జరిగే కనకదాసు జయంతి, విగ్రహ ఏర్పాటు గురించి చర్చించారు.