కళ్యాణదుర్గం: బులోరా వాహనం బోల్తా - తప్పిన పెను ప్రమాదం

78చూసినవారు
కళ్యాణదుర్గం: బులోరా వాహనం బోల్తా - తప్పిన పెను ప్రమాదం
కళ్యాణదుర్గం మండలం గోళ్ళ గ్రామ సమీపంలోని హైవే రోడ్డులో బులోరా వాహనం బోల్తా పడిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. అనంతపురం నుండి కళ్యాణదుర్గం వెళుతున్న బులోరా వాహనం అదుపుతప్పి బోల్తా పడింది దానిలో ప్రయాణిస్తున్న వారికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. జెసిబి సహాయంతో బులోరా వాహనాన్ని బయటకు తీశారు.

సంబంధిత పోస్ట్