పెన్షనర్లకు ఇన్ కమ్ టాక్స్ నుంచి మినహాయించాలని కళ్యాణదుర్గం పెన్షనర్ల సంఘం ప్రధాన కార్యదర్శి తిప్పేస్వామి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం కళ్యాణదుర్గం పట్టణంలోని పెన్షన్ భవనంలో ఏర్పాటు చేసిన విశ్రాంత ఉద్యోగుల దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పెన్షనర్ల హక్కుల సాధనకు సమష్టిగా పోరాటం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు.