దశలవారీగా ఆందోళనలు చేస్తాం'
కళ్యాణదుర్గం ఆర్ఎంపీ గెస్ట్ హౌస్ ఎదుట సీఐటీయూ నేత వన్నూరుస్వామి అధ్యక్షతన జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు ఏటీఎం నాగరాజు, జిల్లా సహాయకార్యదర్శి అచ్యుత్ ప్రసాద్ పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులు, రెగ్యులర్ అవుట్సోర్సింగ్ ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై దశలవారీగా పోరాటాలు చేయనున్నామని చెప్పారు.